జన్మస్థలం గోపవరం గ్రామంలో కళ్యాణ మండపం నిర్మించిన అవంతి. పుట్టునూరు రుణం తీర్చిన అవంతి.. హర్షం వ్యక్తం చేస్తున్న నూజివీడు ప్రజలు. గొప్ప ఆదర్శవంతుడు అవంతి. కళ్యాణ మండపానికి కన్న తల్లి తండ్రి పేరు పెట్టిన మాజీమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు.
October 08, 2025
గోపవరంలో అవంతి కళ్యాణ మండపం నిర్మాణం. పుట్టునూరు రుణం తీర్చిన అవంతి. కన్న తల్లిదండ్రుల పేరు పెట్టిన మాజీ మంత్రి అవంతి.
నూజివీడు (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను.)
తల్లి తండ్రి పేరు ను చిరస్మరణీయం గా మలచిన తనయుడు అవంతి*
*నూజివీడు*
*ముత్తునూరు మండలం*
*గోప వరం గ్రామం*
*08-10-2025*
*బుద వారం*
*తాను పుట్టిన ఊరికి సొంత నిధులతో కళ్యాణ మండపం నిర్మించిన మాజీ మంత్రి*
*స్థితి కలిగితే గతిని మరిచిపోయే ఈరోజుల్లో తల్లి లాంటి తన సొంత ఊరిని మరువని తనయుని గా గత కాలంలో పాటు నేడు పలు అభివృద్ధి పనులతో నిరూపించుకున్న అవంతి*
*అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టని ఈరోజుల్లో అడగకుండానే తాను పుట్టిన ఊరికి ఏమి కావాలో తెలుసుకుని తన తల్లితండ్రి పేరును చిరస్థాయిగా నిలిపేలా శ్రీ ముత్తంశెట్టి వెంకట నారాయణ శ్రీమతి నాగేశ్వరమ్మ పేరు మీద తన సొంత నిధులతో నూజివీడు మత్తునూరు మండలం గోపవరం గ్రామం లో కళ్యాణ మండపం నిర్మాణం చేపట్టి ఈరోజు వేద పండితులు మంత్రోచ్చారణ మద్యలో భక్తి శ్రద్ధలతో సతీ సమేతంగా పూజ లో పాల్గొని కళ్యాణ మండపం ప్రారంభోత్సవం చేశారు*
*వివాహ మరియు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహణ కోసమైనా కళ్యాణ మండపం లేని లోటు ఈరోజు అవంతి శ్రీనివాసరావు గారి ద్వారా తీరడం వలన గ్రామ ప్రజలు సంతోషంతో అవంతి కి దన్యవాదాలు తెలిపారు*
*గ్రామ పెద్దలు స్పందిస్తూ అవంతి మా గ్రామస్థుడైన ఆయన అవంతి విద్యా సంస్థల అధినేత గా రాజకీయ నేత గా ఎక్కడ ఉన్నా ఆయన తాను పుట్టిన గ్రామాన్ని మరవడం గాని గ్రామం విషయంలో ఏనాడు ఆలసత్వం చూపడం గాని చేయలేదని,కళ్యాణ మండపం ఒకటే కాదు గతంలో గ్రామంలో తన సొంత నిధులు తో 3 ఎకరాలు స్థలం కొని కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయాన్ని నిర్మించారు అదే ప్రాంతంలో 1కోటి రూ లతో కళ్యాణ మండపం నిర్మించి ప్రారంభోత్సవం చేశారు. బస్ స్టాప్ నిర్మాణం చేపట్టడం తో తో పాటు గత ప్రభుత్వం లో గ్రామం లో ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్ నిర్మాణం లో తన వంతు సహాయం క్రింద 5 లక్షల రూ అందివ్వడం కూడా చేశారని,గ్రామానికి ఉపయోగకరమైన ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు అవంతి శ్రీనివాసరావు గారు చేసారని కొనియాడారు*