*వాసవి విజయం.* కార్యక్రమంలో ఎంవిపి వాసవి క్లబ్ కపుల్స్ అధ్యక్షులు వెంకట రామకృష్ణారావు సేవలను అభినందిస్తూ ది బెస్ట్ ప్రెసిడెంట్ గా, బెస్ట్ రికార్డు మెయింటెనెన్స్ గా అవార్డులు అందజేసిన జోన్ చైర్ పర్సన్ కమల్. నిజాయితీ,నిబద్ధతతో పనిచేస్తున్న వెంకట రామకృష్ణారావుకు అభినందనల వెల్లువ.

జై వాసవి ...జై జై వాసవి వాసవి క్లబ్ ఎం.వి.పి కపుల్స్ (హోస్ట్) ఆధ్వర్యంలో జోన్ చైర్ పర్సన్ గోగుల కమల్ గారి *వాసవి విజయం* కార్యక్రమం తేదీ 11.10
.2025 శనివారం సాయంత్రం ఏడు గంటలకు ప్రభుత్వ గ్రంథాలయం హాల్ నెంబర్ 2 నందు వి 201ఏ క్యాబినెట్ సెక్రటరీ వంకాయల సాయి నిర్మల అధ్యక్షతన అత్యంత వైభవంగా జరిగినది. కమల్ గారు జోన్ 2 లో గల 4 క్లబ్ లు , విశాఖ యువత క్లబ్,ఎంవిపి కపుల్స్ క్లబ్ , ఎంవిపి కాలనీ క్లబ్, పరదేశమ్మ క్లబ్ లు చేసిన సేవలు, కార్యక్రమములు,ఆయనకు క్లబ్బులు అందించిన సహకారములు తెలియజేస్తూ ప్రత్యేకించి ఎంవిపి కపుల్స్ క్లబ్ సేవా కార్యక్రమములు ను కొనియాడుతూ *ది బెస్ట్ ప్రెసిడెంట్* జోన్ ఛైర్పర్సన్ కమల్ గారి చేతుల మీదుగా క్లబ్ ప్రెసిడెంట్ వెంకట రామకృష్ణారావు కు అందజేసినారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి వెంకటరమణమూర్తి గారికి కోశాధికారి చంద్రశేఖర్ గుప్తా గారికి అవార్డులను బహుకరించినారు. మరియు వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ చేస్తున్న ప్రతీ కార్యక్రమంలను ఒక రికార్డు తయారు చేసి వివిధ దినపత్రికల ద్వారా, ఛానల్ల ద్వారా ,ప్రజలకు తెలియ చేస్తున్న ఎంవిపి కపుల్స్ క్లబ్బు ప్రెసిడెంట్ రామకృష్ణారావు గారికి ప్రత్యేకించి *బెస్ట్ రికార్డ్ మెయింటెనెన్స్* అవార్డు కూడా బహుకరించడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో జోన్ 2 లో గల నాలుగు క్లబ్బుల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులతో పాటు, మిగతా జోన్ల చైర్ పర్సన్స్ మరియు రీజనల్ సెక్రటరీస్, ఫ్రెండ్లీ ఆహ్వానితులుగా ప్రత్యేకంగా గవర్నర్ తమ్మన అమర్నాథ్ గారు, వారి శ్రీమతి తమ్మన మానస గార్లు, ప్రత్యేక ఆహ్వానితులుగా క్యాబినెట్ కోశాధికారి చెరుకు కృష్ణ గారు మరియు సుమారు 60 మంది వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు