ఘనంగా మాజీమంత్రి సంకరి అల్వార్ దాస్ 95 వ జయంతోత్సవములు.
October 31, 2025
మధురవాడ, (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్టు మానం శ్రీను మధురవాడ )
దివంగత మాజీ మంత్రి శ్రీ సుంకరి ఆళ్వార్ దాస్ 95 జన్మదిన వేడుకలు ఘనం గా AEC క్యాంపస్ మధురవాడ ఇందిరా విహార ఆడిటోరియం లో శ్రీనివాస ఇన్స్టిట్యూట్ అఫ్ మానేజ్మెంట్ స్టడీస్, సెంటర్ ఫర్ మానేజ్మెంట్ బిజినెస్ స్కూల్ మరియు న్యాయ విద్య పరిషద్ లా కళాశాల విద్యార్థులు, అధ్యాపకలు, అధ్యాపకేతరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రీడ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ సుంకరి రవీంద్ర శ్రీ ఆళ్వార్ దాస్ విద్య సంస్థలను స్థాపించి విశాఖపట్నం లో విద్య అందరికి అందుబాటు లో ఉండాలి అని మంచి నిర్ణయం తో నిర్వహించడం జరిగింది.
అనేక మంది ఈ విద్య సంస్థలలో చదివి మంచి, మంచి ఉద్యోగాలలో ఉన్నారు అని అన్నారు.
ఈ జన్మ దిన వేడుక కార్యక్రమం లో సిమ్స్ కాలేజీ డైరెక్టర్ డాక్టర్ సాయి ప్రశాంత్, ప్రిన్సిపాల్ డాక్టర్ యూ లారెన్స్. cmt బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ అర్చన మరియు లా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ అలక్ చంద్రుడు, విద్యార్థులు, టీచర్లు, ఆఫీస్ స్టాఫ్ మొదలైన వారు అందరు ఆళ్వార్ దాస్ ని కొనియాడారు.
