ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిన కూటమి ప్రభుత్వం --- జివిఎంసి5వ వార్డు కార్పొరేటర్ హేమలత.
November 01, 2025
ఐదవ వార్డ్ లో పింఛన్లు పంపిణీ చేసిన కార్పొరేటర్ మొల్లి హేమలత.
భీమిలి నియోజకవర్గం, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :
మధురవాడ, కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి,ప్రజా సంక్షేమ కోసమే నిత్యం పాటుపడుతుందని ఐదవ వార్డ్ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు మొల్లి హేమలత అన్నారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పింఛన్లు పంపిణీ కార్యక్రమం లో భాగంగ ఆమె గాంధీనగర్,శివశక్తి నగర్ కాలనీలలో గల లబ్ధిదారుల ఇంటికి నేరుగా వెళ్ళి అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసమే ఆలోచిస్తూ ఉంటారని, దానికోసం అనేక ప్రణాళికలు రచించారని, అందులో భాగంగానే రాష్ట్రానికి వేల కోట్లు పెట్టుబడులు వరదల వస్తున్నాయని, ప్రపంచంలోనే ఐటీ సంస్థలలో గల గొప్పది అయినటువంటి గూగుల్ సంస్థ అమెరికా తర్వాత బయట దేశంలో ఒక్క భారత్ లో గల విశాఖలోనే వేల కోట్లు పెట్టుబడి పెట్టి లక్షల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఇచ్చేలా రూపకల్పన చేస్తుందంటే అది కూటమి ప్రభుత్వ నరేంద్ర మోడీ, చంద్రబాబునాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ శ్రమ ఫలితం అని, ఇది ప్రతి ఒక్కరు హర్షించదగ్గ విషయమని, ఇందుకుగాను కూటమి ప్రభుత్వానికి స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. స్థానిక భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు సహకారంతో 5వ వార్డులో అనేక అభివృద్ధి పనులు చేయగలుగుతున్నామని, ముఖ్యంగా మాస్టర్ ప్లాన్ రోడ్లు పనులు చక చక జరుగుతున్నాయని, కొండవాలు ప్రాంతాలలో తుఫాన్ ప్రభావిత కాలనీలలో రక్షణ చర్య నిమిత్తం రక్షణ గోడలు నిర్మించుటకై చర్యలు చేపట్టడం జరుగుతుందని, వార్డులో మౌలిక వసతులు కల్పన ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని ఆమె అన్నారు. అలాగే వృద్ధాప్య వితంతు వికలాంగు ల కొత్త పెన్షన్లు తొందరలోనే ప్రభుత్వం మంజూరు చేస్తుందని అలాగే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందించడం జరుగుతుందని సమర్ధుడు నాయకుడైతే రాష్ట్రం అభివృద్ధిలో సంక్షేమంలో పరుగులు పెడుతుందని అనటానికి ఇదే నిదర్శనమని కార్పొరేటర్ హేమలత అని అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శిలు, స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
