సత్యసాయి సేవా సంస్థలలో పనిముట్టుగా ఉన్న ప్రతి సాయిభక్తుడికి స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.. తాటి చెట్ల పాలెం లో నూతనంగా నిర్మించిన ఆనంద నిలయ భవనాన్ని రాష్ట్ర సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు ఆర్ లక్ష్మణరావు ప్రారంభోత్సవం లో, రాష్ట్ర సత్యసాయి సేవా సంస్థల జాయింట్ సేవాదళ్ కోఆర్డినేటర్ రాఘవరావు ఆధ్వర్యంలో నూతన మందిర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది జిల్లా అధ్యక్షులు పిఆర్ఎస్ ఎన్ నాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రేమ తత్వాన్ని పెంపొందించుకుంటూ స్వామి సేవలో పాల్గొని సత్యసాయి ఆశయ సాధన కోసం . కృషి చేయాలన్నారు.
October 30, 2025
విశాఖ సిటీ, తాటి చెట్ల పాలెం, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్టు మానం శ్రీను మధురవాడ )
ఓం శ్రీ సాయిరాం... భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శతవర్ష 💯 వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా 30.10. 2025 గురువారం, సాయంత్రం 6:30 నిమిషముల కు రైల్వే ఏరియా సాయి సౌధా సమితి ...తాటి చెట్ల పాలెం భజన మండలి వారు నూతనంగా నిర్మించిన మందిరం *ఆనంద నిలయం* భవనాన్ని ముఖ్యఅతిథి , ఆంధ్ర రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థలు అధ్యక్షులు శ్రీ ఆర్ లక్ష్మణరావు ప్రారంభోత్సవం చేశారు.. మందిరం కన్వీనర్ ప్రసాద్ అతిధులను వేదికపైకి ఆహ్వానించి తన ప్రసంగంలో మందిరం గత నివేదికను అందించారు. మందిరం ముఖ్య సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సత్యసాయి సేవా సంస్థలు జాయింట్ సేవాదళ్ కోఆర్డినేటర్ రాఘవరావు మాట్లాడుతూ 1993 వ సంవత్సరము నుండి మందిరంలో సభ్యుడిగా ఉన్న దగ్గర నుండి ప్రస్తుతం రాష్ట్ర జాయింట్ సేవాదళ్ కోఆర్డినేటర్ గా తన యొక్క ప్రస్థానాన్ని, మరియు మందిరం అభివృద్ధి వివరించినారు. జిల్లా అధ్యక్షులు పి.ఆర్.ఎస్.ఎన్ నాయుడు మాట్లాడుతూ సభ్యులందరూ ప్రేమతత్వంతో ఉండి సహాయ సహకారాలు అందిస్తూ మందిరాన్ని చక్కగా అభివృద్ధి పరిచినందుకు ధన్యవాదాలు తెలిపినారు . తదనంతరం ముఖ్యఅతిథి లక్ష్మణరావు మాట్లాడుతూ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ( ఎస్ .ఎస్. ఎస్. ఎస్. ఎస్) ప్రతి ఎస్ లోని ఉన్న పరమార్ధాన్ని భక్తులకు ఆకట్టుకునే విధంగా తన దివ్య సందేశాన్ని అందించినారు. సత్య సాయి సేవా సంస్థల్లో మీరు ఒక పనిముట్టుగా ప్రస్తుతం ఉన్నారు అనుకుంటే అది తరతరాలుగా మీ తల్లిదండ్రులు తాతా ముత్తాతలు వారి ముత్తాతలు చేసుకున్న పుణ్య ఫలితంగా మీరు ఈరోజు భగవాన్ శ్రీ సత్యసాయి సంస్థలలో ఒక పనిముట్టుగా సేవలందిస్తున్నారని చెప్పినారు. ఈ అదృష్టం ఈ భాగ్యం ఏ ఒక్కరికో కలుగుతుందని దాన్ని సత్యసాయి సంస్థలో సేవలందిస్తున్న వారందరూ గుర్తెరిగి మరిన్ని సేవా కార్యక్రమంలో పాల్గొని భగవాన్ బాబా వారి దివ్య కృపకు పాత్రులు కాగలరని ఆకాంక్షిస్తూ, స్వామివారి శతవర్ష జన్మదిన వేడుకలు జరుగుతున్న పుట్టపర్తి, ప్రశాంతి నిలయంలో కనీసం ఒక రోజైనా మీరందరూ తప్పకుండా పాల్గొనాలని తన ఉపన్యాసాన్ని ముగించినారు. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ ద్వారం స్వామి, మన్యం జిల్లా అధ్యక్షులు నేతాజీ నాయుడు, రైల్వే ఏరియా సమితి సాయి సౌధా కన్వీనర్ హరిహరరావు, సిటీ సమితి, ప్రేమ సదన్ కన్వీనర్ సాయికుమార్, పాడేరు వాటర్ ప్రాజెక్ట్ నిర్వాహకులు మూర్తి, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఇన్చార్జి సత్యనారాయణ,జిల్లా పదాధికారులు, ఎం వి వి సిటీ సాయి సెంటర్ నిర్వాహకులు వెంకట రామకృష్ణారావు, మందిరం ఇన్చార్జులు, సత్య రావు, ప్రదీప్ కిరణ్ , మందిరం సభ్యులు,జిల్లా యువత మరియు సాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


