విశాఖ జిల్లా వాసవి క్లబ్ గవర్నర్గా వంకాయల సాయినిర్మల ఏకగ్రీవ ఎన్నిక. ఘన సన్మానం.

విశాఖ జిల్లా 2026 నకు వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ గా వంకాయల సాయినిర్మల ఏక గ్రీవ ఎన్నిక. విశాఖ సిటీ,ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) ------------------------------ తేదీ 16.10.2025 గురువారం అంతర్జాతీయ వాసవి క్లబ్స్ జిల్లా వి.201ఏ జిల్లా గవర్నర్ 2026 సంవత్సరం నకు గాను వంకాయల సాయి నిర్మల నామినేషన్ ప్రక్రియ పరిశీలించిన ఎలక్షన్ కమిటీ సభ్యులు ఏక గ్రీవంగా ఎన్నిక అయినట్లు జిల్లా ఎన్నికల అధికారి కొల్లూరు సోమేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 73 క్లబ్బులు ఉన్నాయని 4,500 మంది సభ్యులు ఉన్నారని ఒకే ఒక నామినేషన్ వనితా కె. సి. జి. ఎఫ్.వైజాగ్ ఫెమినా క్లబ్ నుంచి వచ్చిందన్నారు. ప్రస్తుత జిల్లా గవర్నర్ తమ్మన అమర్నాథ్, కోశాధికారి చెరుకు కృష్ణ లు మాట్లాడుతూ, 2025 జిల్లా ప్రధాన కార్యదర్శిగా అకుంఠిత దీక్ష, కార్యదక్షత, సేవా తత్పరత కలిగి వివిధ క్లబ్ ల అందరి సభ్యుల మన్ననలు పొందుతూ ఆమె చేసిన సేవలు కు ఫలితంగా ఈ ఏకగ్రీవంగా ఎన్నిక అవ్వడం ఒక విశేషం గా అభివర్ణించారు. మిగిలిన ఎలెక్షన్ కమిటీ సభ్యులతో పాటు ఎం.వి.పి. కపుల్స్ క్లబ్ అధ్యక్షులు వెంకట రామకృష్ణ రావు ,సభ్యులు వెంకట రమణ మూర్తి,చంద్రశేఖర్ గుప్తా,కృష్ణ రావు,గంగాధరం,కృష్ణకుమారి,అప్పలరాజు మున్నగు వారు వంకాయల సాయినిర్మలను అభినందిస్తూ సాలువతో సత్కరించినారు.