ఎం వివి సిటీ సత్యసాయి సెంటర్ బాధ్యులు రామకృష్ణ,శివాజీ,ఆధ్వర్యంలో పేదలకు అమృత కలశాల పంపిణీ. పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో సేవ చేస్తున్న మహిళ కుటుంబానికి అమృత కలశం అందజేస్తున్న ఎస్సై సునీత మేడం.

విశాఖ సిటీ,ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ) ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ( 💯 వ) శతవర్ష జన్మదిన వేడుకలు లో భాగంగా ఎంవీవీ సిటీ శ్రీ సత్యసాయి సేవా సెంటర్ ఆధ్వర్యంలో 💯 అమృత కలశములు పంపిణీ చేయు కార్యక్రమంలో సుద్ధ గెడ్డ, చాకలి గెడ్డ, కొమ్మాది, మిదిలాపురి కాలనీ, పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న నిరుపేదలకు 22 వస్తువులతో కూడిన వంట సామాగ్రి ( 10 kg బియ్యము ,పప్పు దినుసులు, పంచదార, ఆయిల్ ప్యాకెట్ గోధుమపిండి, తదితరవస్తువులు లబ్ధిదారుల గృహము వద్దకు తీసుకెళ్లి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంవివి సిటీ సాయి సెంటర్ నిర్వాహకులు టంకాల వెంకట శివాజీ , అనంతపల్లి వెంకట రామకృష్ణారావు మరియు సేవాదళ్ సభ్యులు మల్లికార్జునరావు, శ్రీనివాసరావు, చంద్రశేఖర్, ప్రభాకర్ రావు రిపోర్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.