దీపావళి సామాగ్రి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే నిబంధనల ప్రకారం నిర్వహకుల అమ్మకాలు జరపాలి. లేకపోతే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటా పి ఎం పాలెం పోలీస్ స్టేషన్ సిఐ బాలకృష్ణ హెచ్చరిక. నగర సిపి ఆదేశాలు తప్పకుండా పాటించాలి .
October 18, 2025
(ప్రజా బలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
విశాఖ నగర సిటీ పోలీస్,, అనుమతులు లేకుండా మందుగుండు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
పి.ఎం.పాలెం పి.ఎస్ సి.ఐ గేదెల బాలకృష్ణ స్పష్టం
దీపావళి బాణాసంచా విక్రయాల కోసం తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి
పోలీస్, అగ్నిమాపకశాఖ, జీవీఎంసీ నుండి అనుమతులు అవసరం
అనుమతుల్లే కుండా అమ్మితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక
పరిమితికి మించి స్టాక్ ఉంచకూడదని వ్యాపారస్తులకు సూచన
ఇప్పటివరకు 36 స్టాల్స్‌కు అనుమతుల కోసం దరఖాస్తులు
లైసెన్స్ పొందిన వారు మాత్రమే మధురవాడ-ఓజోన్ వ్యాలీ రోడ్డులో స్టాల్స్ ఏర్పాటు చేయాలి
ప్రతి స్టాల్ వద్ద నీరు, ఇసుక, ఆక్సిజన్ వంటివి తప్పనిసరిగా ఉండాలి🔸 నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవు..