ఎంవిపి వాసవి క్లబ్ కపుల్స్ అధ్యక్షులు వెంకట రామకృష్ణకి అవార్డుల పంట, సేవకు గుర్తింపు.
October 20, 2025
జై వాసవి ...జై జై వాసవి
విశాఖ సిటీ,(ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ) ఆదిమూలం వారి ఆనందోత్సవం ... రావూస్ రెవెలరీ ... (రికాన్ 2025) రీజియన్ కాన్ఫరెన్స్ వీ 201 ఏ
రీజియన్ - 3 చైర్ పర్సన్ ఆదిమూలం తిరుపతిరావు అధ్యక్షతన విశాఖపట్నం వాసవి క్లబ్ ఆధ్వర్యం లో తేదీ 19.05.2025 ఆదివారం సాయంత్రం అంతర్జాతీయ వాసవి క్లబ్ ఉపాధ్యక్షులు నంబూరి.ఆర్.సీ.ఎస్. నాగేశ్వరరావు ముఖ్య అతిధి గా పాల్గొన్న స్థానిక ప్రభుత్వ గ్రంథాలయం హాల్ నెంబర్ 2 నందు అత్యంత వైభవంగా జరిగినది. విశాఖ జిల్లా లో గల 8 క్లబ్ లు ,విశాఖపట్నం ,ఎంవిపి కపుల్స్ , ఎంవిపి కాలనీ ,విశాఖ యువత ,మహా విశాఖ, వనితా విశాఖ, విశ్వ వాసవి ,పరదేశమ్మ లు చేసిన సేవలు, కార్యక్రమములు,ఆయనకు క్లబ్బులు అందించిన సహకారములు తెలియజేస్తూ ప్రత్యేకించి ఎంవిపి కపుల్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు ను కొనియాడుతూ *ది ఫస్ట్ బెస్ట్ ప్రెసిడెంట్* *అవార్డ్ , బెస్ట్ అవుట్ స్టాండింగ్ క్లబ్ అవార్డు లు రీజియన్ చైర్ పర్సన్* చేతుల మీదుగా *క్లబ్ ప్రెసిడెంట్ వెంకట రామకృష్ణారావు* కు అందజేసినారు. అదేవిధంగా ఫస్ట్ బెస్ట్ ప్రధాన కార్యదర్శి అవార్డ్ వెంకటరమణమూర్తి కి *ఫస్ట్ బెస్ట్ కోశాధికారి* చంద్రశేఖర్ గుప్తా గారికి అవార్డులను బహుకరించినారు. మరియు వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ చేస్తున్న ప్రతీ కార్యక్రమాలను ఒక రికార్డు తయారు చేసి వివిధ దినపత్రికల ద్వారా, ఛానల్ల ద్వారా ,ప్రజలకు తెలియ చేస్తున్న ఎంవిపి కపుల్స్ క్లబ్బు ప్రెసిడెంట్ రామకృష్ణారావు కు ముఖ్య అతిథి అభినందిస్తూ తన యొక్క 18 సంవత్సరాల వాసవి క్లబ్ ప్రస్థానంలో ఇటువంటి ముఖ చిత్రములతో కూడిన ఫైల్ డేటా ఎక్కడ చూడలేదు సరి కదా అది ఒక ప్రత్యేక జ్ఞాపకాలతో ఆ క్లబ్బునందు చిరస్థాయిగా ఉంటుందని
*బెస్ట్ రికార్డ్ మెయింటెనెన్స్*
అవార్డు మరియు ప్రత్యేకించి ఆయన చేతులు మీదుగా నగదు బహుమతి సేవా కార్యక్రమాలుకోసం వినియోగించమని , అదేవిధంగా చాక్లెట్ బాక్స్ కూడాను ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుకరించినారు.
ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా గవర్నర్ తమ్మన ఆమర్నాథ్, క్యాబినెట్ సెక్రెటరీ సాయినిర్మల, క్యాబినెట్ కోశాధికారి చెరుకు కృష్ణ, మరియు రీజియన్ 3 లో గల 8 క్లబ్బుల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులతో పాటు, మిగతా జోన్ల చైర్ పర్సన్స్, రీజియన్ చైర్ పర్సన్స్, మరియు రీజనల్ సెక్రటరీస్, వివిధ క్లబ్బుల సభ్యులు సుమారు 125 మంది వరకు హాజరైనారు. ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన రీజన్ చైర్ పర్సన్ తిరుపతి రావు కి అదేవిధంగా ఆతిథ్యం వహించిన విశాఖపట్నం వాసవి క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారులకు ముఖ్య అతిథి కృతజ్ఞతలు తెలిపినారు.
