అంతర్జాతీయ వాసవి క్లబ్ సరస్వతీ పథకం ద్వారా మెరిట్ విద్యార్థులకు వెయ్యి రూపాయలు చొప్పున స్కాలర్షిప్ అందజేసిన ఎంవిపి వాసవి క్లబ్ కపుల్స్ అధ్యక్షులు వెంకట రామకృష్ణ.
October 22, 2025
విశాఖ సిటీ,ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను,
మధురవాడ )
జై వాసవి ...జై జై వాసవి
వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వాసవి క్లబ్ వారి సరస్వతీ పథకం ద్వారా క్లబ్ కు అందజేసిన 5,000 రూపాయలు తేదీ 22 10 2025 బుధవారం నాడు ఉదయం
9 గంటలకు ఐదుగురు మెరిట్ స్టూడెంట్లకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున ఎంవిపి కాలనీ 9వ సెక్టార్ లో గల ఎస్ ఎస్ వి క్లాసెస్ స్కూలు నందు అనిత మేడం శకుంతల మేడం అధ్యాపకుల సమక్షంలో ముగ్గురు విద్యార్థినిలకు ఇద్దరు విద్యార్థులకు స్కాలర్షిప్ గా అందజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వాసవియన్స్ వెంకట రామకృష్ణారావు, కోశాధికారి చంద్రశేఖర్ గుప్తా, చార్టర్ ప్రెసిడెంట్ చెరుకు కృష్ణ, ప్రోగ్రాం చైర్మన్ శివరామకృష్ణ, పూర్వపు అధ్యక్షులు మల్లేశ్వర గుప్తా, గ్రంధి కృష్ణారావు పాల్గొన్నారు.

