వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో అల్లిపురం ఏరియాలో నిరాశ్రయులైన వయోవృద్ధులకు స్వర్గీయ కళావతి జ్ఞాపకార్థం అన్నదానం.

కీర్తిశేషులు పలుకూరి (భోగవిల్లి) కళావతి జ్ఞాపకార్థం, వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో నిరాశ్రయులైన వయో వృద్ధులకు అన్నదానం. విశాఖ సిటీ,ప్రజాబలం న్యూస్ : (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) జై వాసవి. జై జై వాసవి. వాసవిక్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో 22.10.2025 బుధవారం, రాత్రి భీం నగర్ (అల్లిపురం) AUTD లో ఉన్న నిరాశ్రుయులైన వయోవృద్ధులకు కీర్తిశేషులు శ్రీ పలుకూరి (బోగవల్లి ) కళావతి గారి జ్ఞాపకార్థం వారి భర్త వెంకటేశ్వరరావు కుమార్తెలు వైశాలి, స్మిత గార్ల సహకారంతో భోజన సదుపాయం ఏర్పాటు చేయడమైనది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వెంకటరమణమూర్తి , కోశాధికారి చంద్రశేఖర్ గుప్తా, చార్టర్ ప్రెసిడెంట్ చెరుకు కృష్ణ, పూర్వపు అధ్యక్షులు మల్లేశ్వర గుప్తా, క్లబ్ సభ్యులు చెరుకూరి నరసింగ రావు మరియు కళావతి గారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.