విద్యార్థులు సోదర భావంతో మెలగాలి, ర్యాగింగ్ కు దూరంగా ఉండాలి. విద్యపై దృష్టి సారించి భవిష్యత్తుకు బాటవేసుకోవాలి.... విశాఖ నార్త్ ఏసిపి ఎస్ అప్పలరాజు విద్యార్థులకు అవగాహన.

ర్యాగింగ్ కు దూరంగా ఉండాలి. విద్యార్థులు సోదర భావంతో మెలగాలి. విద్యార్థులకు ఏసీపీ. ఎస్ అప్పలరాజు సూచనలు భీమిలి నియోజకవర్గం, (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను.) ర్యాగింగ్ కు విద్యార్థులు దూరంగా ఉండాలని విశాఖ నార్త్ సబ్ డివిజన్ ఏసిపి.ఎస్. అప్పలరాజు సూచించారు. తోటి విద్యార్థులను కుటుంబంలో సభ్యుల వలె ఆదరించి బాధ్యతగా సోదర సోదరీమణుల భావంతోమెలగాలని కోరారు.భీమిలి జీవీఎంసీ రెండవ వార్డు ఎన్ఆర్ఐ వైద్య కళాశాలలో గురువారం మధ్యాహ్నం నిర్వహించిన ర్యాగింగ్ అవగాహన సదస్సులో ఏసిపి.ఎస్.అప్పలరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ .తల్లిదండ్రుల ఆశయాలను, లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని విద్యాభ్యాసం కొనసాగేలా ముందుకు సాగాలని పేర్కొన్నారు.అధ్యాపకులకు సహకరిస్తూ వివిధ పాఠ్యాంశాల పై మెలికవులు నేర్చుకొని శ్రద్ధాసక్తుల కనబరచాలని సూచించారు..విద్యార్థిని విద్యార్థులలో పోటీతత్వం పెరగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల మధ్య వికృత చేష్టలను అరికట్టడం ద్వారా సీనియర్లు,జూనియర్ విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని కోరారు.చెడు వ్యసనాల,ర్యాగింగ్ వికృత చేష్టలను ప్రోత్సహించి చట్ట వ్యతిరేకులుగా మారవద్దని హితవు పలికారు.తరగతి గదులలో ప్రశాంత వాతావరణ నెలకోనేలా అధ్యాపకులకు, యాజమాన్యానికి సహకరించాలని ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో భీమిలి సీఐ.బి. తిరుమలరావు ఎస్ ఐ గౌరీ,,ఎన్.ఆర్.ఐ పరిపాలన అధికారి శివ ప్రసాద్,వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ నరేష్,,అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు..