ఎంవిపి వాసవి క్లబ్ కపుల్స్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీలో వయోవృద్ధులకు అన్నదానం. లక్ష్మీకాంతం ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆమె తనయుడు హరిగోపాల్ ఆర్థిక సహాయం.
October 28, 2025
జై వాసవి.. జై జై వాసవి.
విశాఖ సిటీ (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానo శ్రీనుమధురవాడ))
వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు పల్లపోతు లక్ష్మీకాంతం గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా
వాళ్ల కుమారుడు హరిగోపాల్,కోడలు నాగమణి ల ఆర్థిక సహాయంతో ఈ దినం తేదీ 28.10..2025 మంగళవారం ,మధ్యాహ్నం 12.30గంటలకు పెద్ద వాల్తేరు,దలై వారి వీధిలో రెడ్ క్రాస్ సొసైటీ లో ఉన్న నిరాశ్రుయులైన వయోవృద్ధులకు మధ్యాహ్న భోజనములు ఏర్పాటు. చేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వెంకట రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి వెంకటరమణమూర్తి, చార్టర్ ప్రెసిడెంటు చెరుకు కృష్ణ, కొత్తకోట వాసవి క్లబ్ సభ్యులు ఈశ్వర్ రావు గారు పాల్గొన్నారు.

