విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి చిన్న శ్రీను నివాసంలో కార్తీక మాస గోపాష్టమి పూజలు చేసి శ్రీకృష్ణుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు. కుటుంబ సమేతంగా , చిన్న శీను భార్య పుష్పాంజలి, తమ అల్లుడు ప్రదీప్ నాయుడు కుమార్తె సిరి సహస్ర.

తేదీ: 30.10.2025 స్థలం: ధర్మపురి, విజయనగరం. ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) విజయనగరంలోని తననివాసమైన సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్ లో కార్తీక మాస గోపాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా గురువారం నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త గౌరవనీయులు *శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారు, ఆయన సతీమణి శ్రీమతి మజ్జి పుష్పాంజలి గారు, అల్లుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ* గోపాష్టమి వేడుకలులో పాల్గొని శ్రీకృష్ణుని విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. హిందువులకు అత్యంత ప్రీతిపాత్రమైన గోపాష్టమి వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.