భగవాన్ శ్రీ సత్య సాయి బాబా చిత్రపటాన్ని ఆవిష్కరించిన విశాఖ జిల్లా సత్య సాయి సేవా సంస్థల అధ్యక్షులు పి ఆర్ ఎస్ ఎన్ నాయుడు,.
October 30, 2025
విశాఖ సిటీ, తాటి చెట్ల పాలెం :( ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో స్వామివారి శతవర్ష 💯 వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగ తాటి చెట్ల పాలెం లో గల సత్యసాయి భజన మండలి (ఆనంద నిలయం)నూతన ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం తేదీ 30 .10. 2025 ఉదయం 10 గంటల 59 నిమిషములకు శ్రీ సత్య సాయి సేవ సంస్థలు ,జిల్లా అధ్యక్షులు పి ఆర్ ఎస్ ఎన్ నాయుడు చిత్రపట ఆవిష్కరణ గావించినారు. భజన మండలి ముఖ్య సభ్యులు ,గణపతి విగ్రహం మరియు షిరిడి సాయిబాబా విగ్రహం ప్రతిష్టించినారు. స్వామివారికి ప్రత్యేక ఆసనం కూడా ఏర్పాటుచేసి ఆవిష్కరించారు. సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్ర రాష్ట్ర జాయింట్ సేవాదళ్ కోఆర్డినేటర్ రాఘవరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మందిరం కన్వీనర్ ప్రసాద్ , మందిర సభ్యులు కిరణ్ కుమార్, ఎం వి వి సిటీ సాయి సెంటర్ నిర్వాహకులు నాగవేణి,వెంకట రామకృష్ణారావు ,టంకాల జ్యోతి శివాజీ ,రామి నాయుడు వాళ్ళు మందిరాల కన్వీనర్లు సేవాదల సభ్యులు , జిల్లా పదాధికారులు భక్తుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు..



