వర దా కామేశ్వరమ్మ ఆర్థిక సహాయం వయోవృద్ధులకు అన్నదానం. వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో విస్తృతంగా అన్నదాన కార్యక్రమాలు. అన్నం పరబ్రహ్మస్వరూపనే.
November 03, 2025
జై వాసవి. జై జై వాసవి..
విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
వాసవి క్లబ్ ఎంవిపీ కపుల్స్ ఆధ్వర్యంలో
తేదీ 03- 11- 2025, సోమవారం రాత్రి 7.00 గంటలకు భీమ్ నగర్ (అల్లిపురం) AUTD లో ఉన్న నిరాశ్రయులైన 75 మంది వయోవృద్దులుకు , మోటమర్రి (వరదా ) కామేశ్వరమ్మ ఆర్థిక సహాయంతో భోజన సదుపాయం ఏర్పాటు చేయడమైనది. ఈ యొక్క కార్యక్రమంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణమూర్తి కోశాధికారి చంద్రశేఖర్ గుప్తా పూర్వపు అధ్యక్షులు మల్లేశ్వర గుప్తా, గ్రంధి కృష్ణారావు,
పూర్వపు కోశాధికారి హర గోపాల్ రావు , క్లబ్ సభ్యులు సిహెచ్ నర్సింగరావు, కామేశ్వరమ్మ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు


