ఎంవిపి వాసవి క్లబ్ కపుల్ అధ్యక్షులు ఏవిఆర్ సేవలకు అవార్డుల పంట. విశాఖ గురజాడ కళాక్షేత్రంలో అమరేంద్ర విజయోత్సవం పేరుతో ఘనంగా రెండో రోజు విశాఖ జిల్లా 2025 కాన్ఫరెన్స్. 20 26 ఎలెక్ట్l అంతర్జాతీయ వాసవి క్లబ్ అధ్యక్షులు శ్రీ సిద్ధ సూర్యప్రకాశరావుకు విశాఖ రైల్వేస్టేషన్లో ఘన స్వాగతం, భారీ ర్యాలీ.

విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ.) ఇంటర్నేషనల్ వారి విశాఖపట్నం జిల్లా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో రెండో రోజు ఆదివారం ఉదయం 11 గంటలకు గురజాడ కళాక్షేత్రంలో *అమరేంద్ర విజయోత్సవం,* *విశాఖజిల్లా కాన్ఫరెన్స్ 2025* (*డిస్కాన్ 2025*) నకు *2026 ఎలెక్ట్ వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు వాసవియన్ సౌభాగ్య సేవ సంకల్ప శ్రీ సిద్ధ సూర్య ప్రకాశరావు కి నేటి ఉదయం 5 గంటల 30 నిమిషాలకు రైల్వే స్టేషన్ లో ఘన స్వాగతం పలికి హోటల్ మేఘాలయ నకు కార్ల ర్యాలీ తో తీసుకొని వచ్
చిన *2026 ఎలక్ట్ విశాఖ జిల్లా గవర్నర్ వాసవియన్ విద్యా సంకల్ప *కేసిజిఎఫ్ ,శ్రేయోభిలాషి వంకాయల సాయినిర్మల* మరియు *గురజాడ కళాక్షేత్రం* లో జిల్లాలో గల అన్ని వాసవి క్లబ్బుల నుండి హాజరైన సుమారు 3450 మంది సభ్యులతో కిక్కిరిసిన ప్రేక్షకులు మధ్య అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో హాలు మారు మ్రోగింది. అనంతరం 2026 ఎలెక్ట్ అంతర్జాతీయ అధ్యక్షులు వారు తన ప్రసంగంలో 2025 లో ప్రస్తుత అంతర్జాతీయ అధ్యక్షులు ఎరుకుల రామకృష్ణ గారు చేసిన సేవలు ప్రస్తావిస్తూ 2026 లో మరిన్ని ఒత్తిడిలేని సేవా కార్యక్రమాలు చేపట్టి వి సి ఐ ని మరింత ముందుకు తీసుకొని వెళ్ళాలని దానికి ఇప్పటివలె మీరందరూ తప్పకుండా సహాయ సహకారములు అందిస్తారని కోరుకుంటున్నానని తన ప్రసంగాన్ని ముగించారు.తదనంతరం 2026 ఎలెక్ట్ గవర్నర్ వాసవియన్ విద్యా సంకల్ప కేసిజిఎఫ్ శ్రేయోభిలాషి వంకాయల సాయినిర్మల తో ప్రమాణ స్వీకారం చేయించినారు. తర్వాత 2026 గవర్నర్ సాయి నిర్మల తన కేబినెట్ టీం సభ్యులందరితో ప్రమాణం చేయించారు.చివరిగా ఆ ప్రాంగణం లో ఏర్పాటు చేసిన వివిధ క్లబ్బుల స్టాల్స్ ను పరిశీలనకు ముగ్గురు జడ్జిలు నియమించి వారినుండి ఉత్తమ స్టాల్ల్స్ కోసం అభిప్రాయం సేకరించి, వివిధ క్లబ్బుల సభ్యులు తో బ్యానర్ ప్రజెంటేషన్లు చేయించి అవార్డులను ప్రకటించగా, వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ నకు ఫోటో ఆల్బమ్ అవార్డ్, రికార్డ్ మెయింటెనెన్స్ బుక్ అవార్డ్, అత్యధిక రిజిస్ట్రేషన్ అవార్డు లను గవర్నర్ అమర్నాథ్ గారుచేతులు మీదగా క్లబ్ అద్యక్షుడు రామక్రిష్ణ రావు నకు అందించారు.ఈ 3 అవార్డులు రావటం చాలా ఆనందం గావుందని గవర్నర్ గారికి,మరియు క్లబ్ సభ్యులందరికీ రామకృష్ణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారు..