ఎంవిపి కపుల్స్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం. విశాఖ సిటీ అల్లిపురం భీమ్ నగర్ లో ఏ యు టి డి నిరాశ్రయులైన వృద్ధాశ్రమంలో 85 మందికి అన్నదానం..
December 13, 2025
జై వాసవి... జై జై వాసవి.
విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: (సీనియర్ జర్నలిస్ట్ మనం శ్రీను మధురవాడ )
ఎంవిపి వాసవి క్లబ్ కపుల్స్ ఆధ్వర్యంలో శనివారం తేదీ 13.12.2025 , మధ్యాహ్నం భీం నగర్ (అల్లిపురం)GVMC, AUTD లో ఉన్న నిరాశ్రుయులైన 85 మంది వయోవృద్ధులకు వాసవియన్ గ్రంధి వాసుదేవ మూర్తి ఆర్థిక సహాయంతో ఆయన తండ్రి కీర్తిశేషులు గ్రంధి సూర్యారావు జ్ఞాపకార్థం భోజనం సదుపాయం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో వాసవియన్స్ క్లబ్ కోశాధికారి చంద్రశేఖర్ గుప్తా, కార్యక్రమాల అధ్యక్షులు శివరామకృష్ణ పూర్వపు అధ్యక్షులు గ్రంధి కృష్ణారావు, మల్లేశ్వర గుప్తా(జిల్లా పదాధికారి), అంతర్జాతీయ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గ్రంధి వాసుదేవ మూర్తి, శరత్ రామచంద్ర పాల్గొన్నారు.
