ఘనంగా v201A విశాఖపట్నం జిల్లా కాన్ఫరెన్స్ 2025, అమరేంద్ర విజయోత్సవం,. సేవలకు అవార్డులు, వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ అధ్యక్షులు రామకృష్ణ సేవకు, అంతర్జాతీయ వాసవి క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ చేతుల మీదగా అవార్డు. అవార్డు అందుకుంటున్న ఏ.వి.ఆర్.

విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో V 201 A *విశాఖపట్నం జిల్లా కాన్ఫరెన్స్ 2025 *అమరేంద్ర విజయోత్సవం* పేరిట విశాఖపట్నంలో గల అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం నందు జిల్లా అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు ఎరుకుల రామకృష్ణ సమక్షంలో జిల్లా గవర్నర్ తమన అమర్నాథ్ , తమ్మన మానస, నిర్వహణలో క్యాబినెట్ టీమ్ సభ్యులు అత్యద్భుతంగా జిల్లాలో గల వివిధ వాసవి క్లబ్బుల అధ్యక్ష కార్య దర్శి, కోశాధికారులు, జిల్లా ఆఫీసర్స్ రీజనల్ సెక్రటరీస్, రీజనల్ చైర్ పర్సన్స్, జోనల్ చైర్ పర్సన్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ముఖ్యఅతిథి గా పాల్గొన్న ఎరుకుల రామకృష్ణ ఈ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా వాసవి క్లబ్లు చేసిన విశిష్టమైన, వినోతనమైన అద్భుతమైన సేవా కార్యక్రమాలు తెలియజేశారు. తదనంతరం జిల్లాలో గల వాసవి క్లబ్బులు చేసిన కార్యక్రమాలు ప్రస్తావిస్తూ, రీజనల్, జోన్, క్లబ్బు స్థాయిలలో అద్భుత సేవలు అందించిన వారి అందరికీ జిల్లా గవర్నర్ అమర్నాథ్ తమ్మన, వారి సతీమణి జోన్ చైర్ పర్సన్ తమ్మన మానస ల చేతుల మీదుగా అవార్డుల ప్రధానోత్సవం చేసినారు. అందులో భాగంగా వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ నకు బెస్ట్ క్లబ్ గా గుర్తించి అవార్డును బహుకరించినారు. అదేవిధంగా బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డును, బెస్ట్ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ అవార్డును జిల్లా క్యాబినెట్ కార్యక్రమాల కార్యదర్శి శ్రీ ఐ ఆర్ కె ప్రసాద్, చేతుల మీదుగా వాసవి క్లబ్బు ఎంవిపి కపుల్స్ ప్రెసిడెంట్ వెంకట రామకృష్ణారావు కి బహుకరించినారు. బెస్ట్ క్లబ్ అవార్డు వచ్చినందుకు , వ్యక్తిగతంగా రెండు అవార్డులు వచ్చినందుకు గవర్నర్ అమర్నాథ్ తమ్మన కి, క్యాబినెట్ కార్యదర్శి సాయి నిర్మల గారికి, క్యాబినెట్ కోశాధికారి చెరుకు కృష్ణ కి క్లబ్ సభ్యులందరికీ, ఎంవిపి వాసవి క్లబ్ కపుల్స్ అధ్యక్షులు ఏ.వి రామకృష్ణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినా