ఐక్యమత్యంతో పని చేయాలి, భద్రాచలంలో ప్రధమ క్యాబినెట్ సమావేశం, 2026 ఎలెక్ట్ విశాఖ జిల్లా వాసవి క్లబ్ గవర్నర్ వంకాయల సాయి నిర్మల పిలుపు.

జై వాసవి... జై జై వాసవి...🙏 వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా V 201 A (2026 ఎలక్ట్) గవర్నర్ వాసవియన్ విద్యాసంకల్ప *కేసీజిఎఫ్ శ్రేయోభిలాషి వంకాయల సాయినిర్మల అధ్యక్షతన తేదీ 16.12.2025 మంగళవారం సాయంత్రం7 గంటల 30 నిమిషాలకు క్యాబినెట్ టీం ప్రత్యేక సమావేశం పాండురంగపురం నందు ఆమె స్వగృహం నందు జరిగినది. ఈ సమావేశంలో విశాఖపట్నం జిల్లా ఎలెక్ట్ 2026 గవర్నర్ సాయి నిర్మల, క్యాబినెట్ ప్రధాన కార్యదర్శి పద్మావతి, క్యాబినెట్ కార్యక్రమముల కార్యదర్శి,వైస్ గవర్నర్స్ మరియు ఏడు రీజియన్లకు సంబంధించి రీజియన్ చైర్ పర్సన్స్, జోన్ ఛైర్పర్సన్ రీజియన్ సెక్రటరీస్, పాల్గొనగా అందరి సమక్షంలో 2026 సంవత్సరమునకు గాను జనవరి, ఫిబ్రవరి 2026 నెలలలో, చేయవలసిన కార్యక్రమములు గురించి మరియు మొదటి క్యాబినెట్ సమావేశం భద్రాచలంలో ఏర్పాటు చేయడానికి తగిన ప్రణాళిక రూపొందించినారు. , అందరూ కూడా తమ యొక్క సహాయ సహకారాలు,సేవలు అందించి విశాఖపట్నం జిల్లా వాసవి క్లబ్బులును మరింత ప్రగతి పథం లో తీసుకువెళ్లాలని అందరూ కలిసిమెలిసి పని చేయాలని ,మరిన్ని క్లబ్బులను, మెంబర్ల సభ్యత్వం , కూడా పెంచే దిశగా అందరూ తగు చర్యలు తీసుకోవాలని , ఒత్తిడి లేని సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టాలని కోరారు. ఇంతటి చక్కటి క్యాబినెట్ టీమ్,జిల్లా ఆఫీసర్లను తనకు పరిచయం చేసిన గవర్నర్ అమర్నాథ్ తమ్మన కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసినారు. 2026 లో V 201A విశాఖపట్నం జిల్లా వాసవి క్లబ్బులు అంతర్జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు వచ్చేటట్లు అందరం కలిసి మెలిసి పనిచేయాలని దానికి తగిన కృషి చేయాలని తన ఆశయాన్ని నిలబెట్టాలని గవర్నర్ (2026) సాయి నిర్మల కోరారు. ఈ ప్రత్యేక సమావేశమునకు అతి తక్కువ సమయంలో అందరికీ తెలియపరిచినను ప్రతి ఒక్కరు హాజరై సమావేశాన్ని దిగ్విజయపరిచినందుకు అందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలిపినారు. సమావేశానికి కొసమెరుపు: క్యాబినెట్ కోశాధికారి వాసవియన్ చెరుకు కృష్ణ విదేశాలలో (కెనడా )వున్ననూ తను వీడియో కాల్ చేసి(2026) గవర్నర్ సాయి నిర్మల గారికి మరియు టీం సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేసినారు.