ఎంవిపి వాసవి క్లబ్ కపుల్స్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం. పాలూరి వర్ధంతి సందర్భంగా అతని కుమారుడు గంగాధర ప్రసాద్ అన్నదానం చేశారు.

జై వాసవి. జై జై వాసవి🙏 వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో ఆదివారం తేదీ 14.12.2025 , మధ్యాహ్నం 12.00 గంటలకు పెదవాల్తేరు దళాయి వారి వీధి లో ఐ ఆర్ సి ఎస్ నిరాశ్రయుల వసతి గృహ మందు ఉన్న వయోవృద్ధులకు కీర్తిశేషులు పాలూరి నర్సింగరావు గారి వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు గంగాధర్ ప్రసాద్ గారి ఆర్థిక సాయంతో భోజనం సదుపాయం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో వాసవియన్స్ క్లబ్బు ప్రధాన కార్యదర్శి వెంకటరమణమూర్తి, కోశాధికారి చంద్రశేఖర గుప్త, ప్రోగ్రాం కోఆర్డినేటర్ శివరామకృష్ణ, పూర్వపు అధ్యక్షులు మల్లేశ్వర గుప్తా, క్లబ్ సభ్యులు లతా రాణి నూకరత్నం, మరియు కుటుంబ సభ్యులు గంగాధర్ గుప్తా,మహాలక్ష్మి, మణికంఠ, నందిని పాల్గొన్నారు