అంతర్జాతీయ స్థాయిలో విశాఖ జిల్లావాసవి క్లబ్ కు అవార్డుల పంట. హైదరాబాదులో రెండు రోజులు పాటు క్లాసిక్ కన్వెన్షన్ త్రీ లో జరిగిన సదస్సులో విశాఖ జిల్లా కుమూడవ అత్యుత్తమ గవర్నర్గా తమ్మన అమర్నాథ్ అవార్డు అందుకున్నారు.. వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు రామకృష్ణారావు చేతుల మీదగా అందజేత. ఎంవిపి కపుల్స్ క్లబ్ అధ్యక్షులు ఏవి రామకృష్ణారావుకి, సీతమ్మధార క్లబ్బులకు ఉత్తమ అవార్డులు ,. అవార్డులు అందుకున్న వారికి మరింత బాధ్యత పెంచిన అంతర్జాతీయ అధ్యక్షులు.
December 21, 2025
విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :
అంతర్జాతీయ స్థాయిలో విశాఖ జిల్లాకు అవార్డుల పంట.......
వాసవి క్లబ్ జిల్లా వి 201ఏ కు అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు హైదరాబాద్ లో రెండు రోజుల పాటు జరిగిన క్లాసిక్ కన్వెన్షన్ త్రి లో 3వ అత్యుత్తమ జిల్లా గవర్నర్ గా తమ్మన అమర్నాథ్ గారు అందుకున్నారు. వీరికి జిల్లాలో 1400 మంది సభ్యత్వ సంఖ్య పెంచటం తో పాటు కొత్తగా 38 క్లబ్బులను స్థాపించినందుకు అంతర్జాతీయ స్థాయిలో ఈ అవార్డును గెలుచుకున్నారు. ఇది కాక అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లా కార్యదర్శి గా సాయి నిర్మల ఉత్తమ జిల్లా కోశాధికారి గా చెరుకు కృష్ణ, జిల్లా సేవల ఇంచార్జి కార్యదర్శి ఐ.ఆర్
కె ప్రసాద్ , సకాలంలో రిపోర్టులు పంపినందుకు శ్రీనివాస్ గార్లు అవార్డ్స్ పొందారు. మరియు అనేక అత్యుత్తమ సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు 6 క్లబ్బులు అయిన వాల్తేరు కపుల్స్, గ్రేటర్ విశాఖ కపుల్స్ , వనితా కె.సి.జి. ఎఫ్ వైజాగ్ ఫెమినా క్లబ్, విశాఖపట్నం క్లబ్ మరియు ఏం.వి.పి. కపుల్స్, సీతమ్మధార క్లబ్బులకు ఉత్తమ అవార్డ్స్ ను క్లబ్ అధ్యక్షులు అందుకున్నారు. ఉత్తమ రీజినల్ చైర్పర్సన్స్ గా రమ్య ,పద్మావతి,శైలజా గార్లు , జోన్ ఛైర్పర్సన్ గా కంకటాల సతీష్ ,రీజియన్ కార్యదర్శి గా రమణి తదితరులు అవార్డులు అన్నియు అంతర్జాతీయ అధ్యక్షులు ఎరుకుళ్ళ రామకృష్ణారావు గారి చేతుల మీదుగా అందుకున్నారు.


