జర్నలిస్టులు మంచి కథనాలు ద్వారా విశాఖ బ్రాండ్ విశిష్టత నిలబెట్టాలి, స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవలు ప్రశంసనీయం. జర్నలిస్టులు సమాజ సేవలో కూడా పాల్గొనాలి.--- విశాఖ నగర పోలీస్ కమిషనర్ పిలుపు.

బలమైన కలాన్ని సద్వినియోగపరచండి - మంచి కథనాల ద్వారా వైజాగ్ బ్రాండ్ విశిష్టత నిలబెట్టాలి. - * - స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవలు ప్రశంసనీయం. - ఎస్సిఆర్డబ్ల్యుఏ డైరీ-2026 ఆవిష్కరణ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి. విశాఖ సిటీ,భీమిలి నియోజకవర్గం,( ప్రజా బలం న్యూస్ ఆన్లైన్ సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) కలం చాలా బలమైనది, అది ఉపయోగించే తీరే అతి ముఖ్యమైనదని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. పాత్రికేయులు తమ కలాన్ని కచ్చితంగా ఉపయోగించాలని, ఊహగానాల వైపు వెళ్ళరాదని సూచించారు పౌర గ్రంథాలయంలో శుక్రవారం నిర్వహించిన స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ-2026 ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టులు మంచి కథనాల ద్వారా వైజాగ్ బ్రాండ్ విశిష్టత నిలబెట్టాలన్నారు. స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జర్నలిస్టుల సంక్షేమం కోసం చేస్తున్న సేవలు అద్వితీయ మన్నారు. సమాజ సేవలో కూడా జర్నలిస్టులు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టులు వాస్తవాలకు మాత్రమే అద్దం పట్టే కథనాలు రాయాలని అయితే కొందరు తమ పత్రికల్లో రాసే కథనాలు సత్య దూరంగా ఉంటున్నాయన్నారు. వైజాగ్ బ్రాండ్ పెంచాలే తప్పా ప్రజలను పర్యాటకుల్ని మభ్యపెట్టేలా ఏమార్చెలా ఉండకూడదన్నారు. వైజాగ్ కు ఉన్న గొప్ప పేరూ ప్రతిష్టలు తగ్గించే వార్తలు, మాటలు తప్పన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ సభకు అధ్యక్షత వహించి సుమారు అయిదు వందల పై చిలుకు సభ్యులతో సంస్థ ముందుకు నడుస్తుందన్నారు. సంక్షేమం, ఆరోగ్యం, వృత్తి శిక్షణలు, రక్తదాన శిబిరాలు వంటివి నిర్వహిస్తున్నామన్నారు. పాత్రికేయుల సంక్షేమానికి ప్రాధాన్యతను ఇస్తూ స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జర్నలిస్టులకు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఎన్.యు.జె.ఐ స్కూల్ ఆఫ్ జర్నలిజం అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ ఎన్. నాగేశ్వరరావు అసోసియేషన్ తరపున సత్కరిస్తున్న వివిధ పత్రికల జర్నలిస్టులు అందిస్తున్న సేవలను వివరించి అభినందించారు. కార్యక్రమంలో కుమారి అపర్ణ స్వాగత నృత్యం, సంప్రదాయ నృత్యాలు, దేవి ప్రసాద్ పర్యావరణం, పరివర్తన అంశాలతో కూడిన్ పాడి అలరింపజేశారు. ఈటీవీ ఫేమ్, జీ తెలుగు ఫేమ్ మిమిక్రీ కళాకారుడు ఎంఎస్ఆర్ నాయుడు చేసిన మిమిక్రీ మెప్పించింది. కామెడీ జోక్స్ తో జర్నలిస్టులకు ఉల్లాసాన్ని పంచారు. చందమామ క్రియేషన్స్, అక్షర సారధి, జర్నలిస్ట్ బి ఎస్ చంద్ర శేఖర్ మాస్టర్ అఫ్ శర్మనీ గా వ్యవహరించిన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ డా శంఖ బ్రత బాగ్చి, అతిధి నాగేశ్వర రావు, అసోసియేషన్ అధ్యక్షులు బి అశోక్ కుమార్ ఇతర కార్యవర్గ సభ్యులు 11 మంది సీనియర్ రిపోర్టర్లను సత్కరించారు అందుకున్న వారిలో ఆంగ్ల పత్రిక నుండి ఒకరు, 70 ఏళ్ల పైబడిన ముగ్గురు సుదీర్ఘ అనుభవం కలిగిన పాత్రికేయులు, ఇరువురు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లు, డిపార్ట్మెంట్లు బీట్ చూస్తున్న ఐదుగురు పాత్రికేయులు ఉన్నారు. జి జనార్దనరావు (తెలుగు పీపుల్ డాట్ కం బిజినెస్ ఎడిటర్), సుంకరి చలపతిరావు(ఇండస్ట్రీస్), బి సుబ్రహ్మణ్యం(కల్చరల్), ఆడారి కొండలరావు (సీనియర్ రిపోర్టర్), పి.ఎ.రావు (జీవీఎంసీ), పి.యు.ఎస్ భాస్కర్ (విఎంఆర్డిఏ), పి. భాస్కర్ (స్పోర్ట్స్), టి బంటయ్య (కలెక్టరేట్), పి. విజయ్ కుమార్ (రైల్వే), వేదుల నరసింహం (ఏ యూ పిఆర్ఓ), నండూరి నరసింహం (గీతం పిఆర్ఓ), యువి భాస్కర్ ( క్రైమ్) సత్కారం అందుకున్న వారిలో ఉన్నారు. చిన్న పత్రికల సంఘం నాయకులు మనభూమి సత్యనారాయణ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. బంగారు అశోక్ కుమార్ నేతృత్వంలో 2026 నూతన సంవత్సర డైరీ, స్వీట్స్, పండ్లు జర్నలిస్టులకు పంపిణీ చేసి విందు ఆరగింపజేశారు. అత్యంత ఆహ్లాదకరంగా జరిగిన స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన సంవత్సరానికి వేడుకగా స్వాగతించింది. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్ అశోక్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఎం వి ఎస్ అప్పారావు, పి రవికుమార్, ఈ శ్రీనివాసరావు, ఎంపీఏ రాజు, ఈ హేమ సుందర్, కోశాధికారి కే సత్యనారాయణ (సత్య), కార్యనిర్వాహక కార్యదర్శులు పి రవికుమార్, ఎస్ ఎన్ నాయుడు, ఎం కృష్ణ కిషోర్, ఎం రామచంద్రరావు, కార్యదర్శులు కే విజయ్ కుమార్, ఎస్ చంద్రశేఖర్ (చందు యాదవ్), ఎన్ అనీష్ కుమార్, కే రాంబాబు, వి గౌతమ్, ఎల్ గణపతి రావు, జాయింట్ సెక్రటరీలు పి వసంత్ కుమార్, ఏ అంజనీ కుమార్, ఆర్ ఎలేశ్వరరావు, కే శ్రీనివాసరావు, కే స్వామి వినోద్, పి .అవతారం(పవన్), ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రోజా, పవన్ సాయి, సంతోష్ కుమార్, జయరాం, వెంకటేష్, రాజు, దత్తు తదితరులు పాల్గొన్నారు