ఆరోగ్యకరమైన సమాజాభివృద్ధికి జర్నలిస్టులు కృషి చేయాలి. ----- పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సి.ఐ. బాలకృష్ణ పిలుపు.
December 31, 2025
*జర్నలిస్టులు ఆరోగ్యకర సమాజ అభివృద్ధికి కృషి చేయాలి*
- *పీ.ఎం.పాలెం సీఐ గేదెల బాలకృష్ణ*
- *సమాజ జాగృతంలో జర్నలిస్టులు కీలకం: పీఎంపాలెం ఎస్సై రాము*
- *జర్నలిస్టులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి:సీనియర్ పాత్రికేయులు పిళ్లా విజయ్ కుమార్, చిరికి సత్యనారాయణ, కంటి విజయ్ కుమార్, మానం శ్రీనివాసరావు*
- *జర్నలిస్టుల ఆరోగ్యంపై ఎస్సీఆర్డబ్ల్యూఏ దృష్టి :స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్*
- *ఎస్సీఆర్డబ్ల్యుఏ మధురవాడ యూనిట్ సభ్యులకు డైరీలు, స్వీట్లు పంపిణీ*
*(మధురవాడ ,డిసెంబర్ 31)* జర్నలిజం వృత్తి
పవిత్రమైనదని, సేవా రంగానికి
సంబంధించినదని ప్రజలను మేల్కొల్పే కథనాలను
ప్రచురించాలని ప్రజలను పీఎం పాలెంపోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గేదెల బాలకృష్ణ
సూచించారు. బుధవారం ఉదయం మధురవాడలోని మా మీడియా హబ్ లో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మధురవాడ యూనిట్ సభ్యులకు డైరీలు, స్వీట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిఐ బాలకృష్ణ హాజరై ప్రసంగించారు..ఆరోగ్యకరమైన
సమాజానికి ప్రజలకు
ఉపయోగపడే అనేక అంశాలను
తెలియజేయాలని అన్నారు. ప్రతి ఒక్కరికి నూతన శుభాకాంక్షలు తెలియజేశారు.. అనంతరం పీఎంపాలెం ఎస్ఐ రాము మాట్లాడుతూ సమాజాన్ని జాగృతం చేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని అన్నారు.. సీనియర్ పత్రికేయులు సీనియర్ పాత్రికేయులు పిళ్లా విజయ్ కుమార్, చిరికి సత్యనారాయణ, కంటి విజయ్ కుమార్, మానం శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ జర్నలిస్టులు ఆరోగ్యవంతంగా ఉంటేనే సమాజానికి ఆరోగ్యకరమైన వార్తలు అందించగలుగుతారని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై దృష్టి సారించాలని సూచించారు.. స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల ఆరోగ్యంపై ఎస్సీఆర్డబ్ల్యూఏ దృష్టి సారించిందని అన్నారు..
నిత్యం వార్తా సేకరణలో జర్నలిస్టులు ఒత్తిడికి లోనై అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. కావున ఎస్సీఆర్డబ్ల్యుఏ వైద్యులతో సంప్రదింపులు జరిపిందనీ ,రానున్న మూడు నెలల్లో అసోసియేషన్ సభ్యులకు వైద్య పరీక్షలు, చికిత్సలు జరిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా అసోసియేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.. అనంతరం పీఎంపాలెం సీఐ బాలకృష్ణ, ఎస్సై రాము ల చేతుల మీదుగా మధురవాడ యూనిట్ సభ్యులకు డైరీలు, స్వీట్లు పంపిణీ చేశారు.. అసోసియేషన్ తరపున అతిథులను దుస్సాలువాతో సత్కరించి మెమొంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు,పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.


