వాసవి మాత శోభాయాత్ర ను ప్రారంభించిన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్.
January 03, 2026
జై వాసవి. జై జై వాసవి...
విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :(సీనియర్ జర్నలిస్ట్ మాన0 శ్రీను మధురవాడ.)
అంతర్జాతీయ వాసవి క్లబ్ పిలుపుమేరకు... 02.01.2026 సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు వి 201ఏ గవర్నర్ వాసవియన్ విద్యాసంకల్ప*కేసీజిఎఫ్ శ్రేయోభిలాషి శ్రీమతి వంకాయల సాయి నిర్మల గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి కార్యక్రమంగా పౌర్ణమి సందర్భంగా
*వాసవి విశిష్ట వైభవం*
*శ్రీ వాసవీ మాతశోభాయాత్ర* బీచ్ రోడ్ లో గల పాండురంగ స్వామి ఆలయంనందు దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు *శ్రీ వంశీకృష్ణ యాదవ్* గారు పాల్గొని వాసవి అమ్మవారు శోభ యాత్ర ని ప్రారంభించినారు. అదేవిధంగా
అంతర్జాతీయ అధ్యక్షుని సూచనల మేరకు ప్రతి అపార్ట్మెంట్ కు అత్యవసర సేవల ఫోన్ వివరములు పంప్లేట్ రూపంలో ఏం.ఎల్.ఏ.గారి చేతుల మీదగా అందచెయ్యడం జరిగింది.ఈ శోభాయాత్ర బీచ్ రోడ్ దగ్గర కాళీమాత ఆలయం వరకు మేళతాళాలతో, మహిళలు అత్యుత్సాహముతో కోలాటం చేసుకొని జై వాసవి. జై జై వాసవి.. అని వాసవి మాతను స్మరణం చేస్తూ , మరలా కాళీమాత ఆలయం నుంచి ప్రారంభ స్థలమైన పాండురంగ స్వామి ఆలయమునకు చేరినారు. ఇదేవిధంగా ప్రతి పౌర్ణమి రోజున *శ్రీ వాసవి మాత శోభాయాత్ర* వేరే వేరే ప్రాంతములలో నిర్వహించుట జరుగుతుందని గవర్నర్ గారు తెలియజేసినారు. వాసవి క్లబ్ వనిత కే సి జి ఎఫ్ వైజాగ్ ఫెమినా నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ వాసవి క్లబ్ అధికారి వేదా మధుసూదన్ , ప్రోగ్రాం చైర్మన్ కంకటాల ప్రభాకర్, ముత్తా సతీష్, క్యాబినెట్ ప్రధాన కార్యదర్శి వాసవియన్ పద్మావతి, క్యాబినెట్ కోశాధికారి వాసవియన్ చెరుకు కృష్ణ,వివిధ క్లబ్బుల అధ్యక్షులు, జోన్ చైర్ పర్సన్స్ రీజియన్ సెక్రటరీస్, రీజనల్ చైర్ పర్సన్స్ పాల్గొన్నారు.

