వాసవి క్లబ్ 2025 అధ్యక్షులు ఏ వి ఆర్ పుణ్య దంపతులకు ఘన సన్మానం, ఆయన సేవలకు అనేక పురస్కారాలు. వాసవి ఎన్ వెంకట రామకృష్ణారావుకు జోన్ 2 బాధ్యతలు అప్పగింత.. వాసవి క్లబ్ అంతర్జాతీయ డైరెక్టర్ వాసవి ఎన్ తమ్మన అమర్నాథ్ ముఖ్య అతిథిగా, విశాఖ జిల్లా వాసవి క్లబ్ గవర్నర్ వంకాయల సాయినిర్మల ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా జరిగింది.

జై వాసవి... జై జై వాసవి (విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) వాసవి క్లబ్ ఇంటర్నేషనల్... తేదీ 11.01.2026 శనివారం సాయంత్రం 6 గంటలకు,స్థానిక ప్రభుత్వ గ్రంథాలయం నందు వి 201 ఏ విశాఖపట్నం జిల్లా, వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ 2026 నూతన అధ్యక్షునిగా వాసవియన్ కాపుగంటి వెంకటరమణమూర్తి చే జిల్లా గవర్నర్ వాసవియన్ విద్యాసంకల్ప కేసీజిఎఫ్* శ్రేయోభిలాషి సాయి నిర్మల గారు ప్రమాణం చేయించినారు. తదుపరి నూతన అధ్యక్షుని అంగీకారంతీసుకొని ప్రధాన కార్యదర్శి గా వాసవియన్ చంద్ర శేఖర్ గుప్తా, కోశాధికారిగా వాసవియన్ చెరుకూరి నరసింగరావు , ఉపాధ్యక్షులు కాపుగంటి శ్రీనివాసరావు మరియు ఇ సి మెంబెర్స్ చే ప్రమాణం చేయించినారు.. తదనంతరం ముఖ్య అతిధి వాసవి క్లబ్ అంతర్జాతీయ డైరెక్టర్ వాసవియన్ తమ్మన అమర్నాథ్, ఇన్స్టలేషన్ అధికారిని గవర్నర్ సాయి నిర్మలలు అంతర్జాతీయ వాసవి క్లబ్ కార్యక్రమాలు గురించి వివరించినారు. తదనంతరం వారి ఇరువురు నకు, ఇతర అతిథి లకు క్లబ్ సభ్యులు సన్మానం చేసినారు. అమర్నాథ్ మరియు సాయినిర్మల 2025 అద్యక్షుని గా మంచి సేవలు అందించిన వాసవియన్ వెంకట రామకృష్ణారావు కు ప్రశంసలు కురిపించి, సేవలు కు ప్రతిఫలంగా అనేక అవార్డులు మరియు జోన్ 2 చైర్ పర్సన్ బాధ్యత ఇవ్వడం జరిగిందని తెలిపినారు.నూతనంగా ఎన్నికైన వారు కూడా ఇంకనూ మంచి స్థాయిలో కార్యక్రమాలు చేసి క్లబ్ ను ముందుకు తీసుకొని వెళ్ళాలని కోరారు. క్లబ్ సభ్యులు కూడా రామకృష్ణారావు ను కొనియాడి సత్కరించారు.ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ఉపాధ్యక్షులు వేద మధుసూదన్ గారు , పూర్వపు గవర్నర్ యుగంధర్ గారు, కేబినెట్ ప్రధాన కార్యదర్శి పద్మావతి, క్యాబినెట్ సేవావిభాగపు కార్యదర్శి రమణి, ప్రాంతీయ అధికారిని మానస, ప్రాంతీయ కార్యదర్శి కమల్ కుమార్ మరియు అధిక సంఖ్యలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.