వాసవి క్లబ్ గ్రేటర్ విశాఖ కపుల్స్ ఆధ్వర్యంలోఘనంగా స్వామి వివేకానంద జయంతి

జై వాసవి... విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) తేదీ 12.01.2026 సోమవారం వివేకానందుని జన్మదినం సందర్భంగా వాసవి క్లబ్ గ్రేటర్ విశాఖ కపుల్స్, వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ మరియు గ్రేటర్ యంగ్ తరంగ్ సభ్యులు సంయుక్త ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో క్యాబినెట్ కోశాధికారి వాసవియన్ చెరుకు కృష్ణ,క్లబ్ అధ్యక్షులు వాసవియన్స్ కోలగట్ల తరణి, కందుల సురేష్, పూర్వపు అధ్యక్షులు వాసవియన్ గ్రంధి కృష్ణారావు, సభ్యులు పాల్గొన్నారు.