గ్రేటర్ విశాఖ, వాసవి క్లబ్ కపుల్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 2026 అధ్యక్షులుగా వి ఎన్ కే సి జి ఎఫ్, కందుల సురేష్ ప్రమాణ స్వీకారం.

విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) విశాఖపట్నం నగరంలో సామాజిక సేవా రంగంలో ప్రముఖ సంస్థ అయిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలోని వాసవి క్లబ్ గ్రేటర్ విశాఖ కపుల్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార సభ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం జనవరి 4, 2026 (ఆదివారం) ఉదయం 8.30 గంటలకు విశాఖపట్నం రామ్‌నగర్‌లోని వీఎంఆర్‌డిఏ కాంప్లెక్స్, రేగన్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ సందర్భంగా *Vn కెసీజీఎఫ్ కందుల సురేష్ గారు* 2026 సంవత్సరానికి అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు డా జి శ్రీనివాస్ కార్యదర్శి గా, టి రాజేష్ కోశాధికారి గా మరియు నూతన కార్యవర్గ సభ్యులు కూడా పదవులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ దింతకూర్తి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై సభను ఉద్దేశించి ప్రసంగించారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ వంకాయల సాయి నిర్మల గారు ఇన్‌స్టాలేషన్ ఆఫీసర్‌గా వ్యవహరించారు. అలాగే ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్‌కు చెందిన పలువురు ప్రముఖులు, జిల్లా, ప్రాంతీయ, జోనల్ స్థాయి నాయకులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొని నూతన అధ్యక్షునికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కందుల సురేష్ మాట్లాడుతూ, 2026 సంవత్సరంలో సేవ, సహకారం, సామాజిక బాధ్యత ప్రధాన లక్ష్యాలుగా పనిచేస్తామని, విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. కార్యక్రమం ఉదయం అల్పాహారంతో ప్రారంభమై, మధ్యాహ్న భోజనంతో ముగిసింది.