రీజియన్2, జోన్2 వాసవి క్లబ్బుల పనితీరును సమీక్షించిన వాసివియన్ గోల్డెన్ స్టార్ శ్రేయోభిలాషి. ముఖ్య అతిథి కె.వి గుప్తా. --నివేదిక సమర్పించిన ఎంవిపి కపుల్స్ జోన్ 2 చైర్పర్సన్ ఏవి రామకృష్ణారావు.--- మరిన్ని సేవలను విస్తృతి పరచాలి. ప్రతి ఒక్కరూ మరింత సేవా భావాన్ని పెంపొందించుకొని ఐక్యమత్యంగా పనిచేస్తే మరింత పురోగతి సాధించవచ్చు -- కె.వి.గుప్తా.

విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్:( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )

జై వాసవి... జై జై వాసవి...🙏
వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్,
విశాఖపట్నం జిల్లా వి 201ఏ – రీజియన్ 2... జోన్ 2 ద్వితీయ సమావేశం తేదీ 10.08.2026 సోమవారం ఉదయం 10 గంటలకు
రీజియన్ 2 లో గల జోన్ -2 యొక్క ద్వితీయ సమావేశం ఈ రోజు జోన్ చైర్‌పర్సన్ వాసవియన్ కపుల్ స్టార్ కె సి జి ఎఫ్ వెంకట రామకృష్ణారావు గారి సమర్థ నాయకత్వంలో విజయవంతంగా సంపత్ రెసిడెన్సి, రాయల్ లేఅవుట్ నందు నిర్వహించబడింది. సమావేశం సమయానికి ప్రారంభమై, జోన్ 2 లోని అన్ని క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు ఉత్సాహరితంగా పాల్గొనడంతో సమావేశం చక్కగా కొన సాగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వాసవియన్ గోల్డ్ స్టార్ కె సి జి ఎఫ్ కె విశ్వనాథ గుప్తా గారు అంతర్జాతీయ ఉపాధ్యక్షులు (మల్టిపుల్), ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా సమావేశానికి అధ్యక్షత వహించిన రీజియన్ 2 లో గల జోన్ 2 చైర్ పర్సన్ వెంకట రామకృష్ణారావు తన జోన్ లో గల క్లబ్బుల యొక్క నివేదికలు ముఖ్య అతిధికి సమర్పించగా, వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్, వాసవి క్లబ్ శ్రీ మేఘాద్రి గడ్డ డైమండ్స్, వాసవి క్లబ్ కంచరపాలెం, వాసవి క్లబ్ వైజాగ్ క్లబ్బుల యొక్క అధ్యక్షులు వారి యొక్క క్లబ్బుల నిర్వహించిన కార్యకలాపాలను, పురోగతిల నివేదికలను ముఖ్య అతిథి ముందు పాలుపంచుకున్నారు.
సమావేశమునకు విచ్చేసిన ముఖ్యఅతిథి వాసవియన్ గోల్డెన్ స్టార్ శ్రేయోభిలాషి కె.వి గుప్తా గారు మాట్లాడుతూ రీజియన్ 2 జోన్ 2 లో గల క్లబ్బులు చేసిన కార్యక్రమాలను కొనియాడుతూ ప్రశంసలు కురిపించారు. వి సి ఐ వారు సూచించిన పథకముల గురించి కూడా తెలియజేసినారు. క్లబ్బులు మరింత ప్రగతి పథంలో నడాలి అంటే సేవా కార్యక్రమాలు పెంచి బలోపేతం చేయాలని సూచనలు సలహాలు ఇచ్చినారు. తదనంతరం ముఖ్యఅతిథికి వెంకట రామకృష్ణారావు మరియు వివిధ క్లబ్బుల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు సాలువతో చిరు సత్కారం చేసి బహుమతిని అందించినారు. ఈ సమావేశంలో అలాగే రీజియన్-2లోని అన్ని క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులుపాల్గొన్నారు.