విశాఖ అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో అంబరాన్నంటిన మనోదర్శిని వాసవి రీజనల్ ప్రాంతీయ సమావేశం.... రీజనల్ చైర్ పర్సన్ వాసవి ఎన్ తమ్మన మానస పరిరక్షణలో విజయవంతంగా రీజనల్ కాన్ఫరెన్స్.. సూపర్ బెస్ట్ జోన్ చైర్ పర్సన్ గా అవార్డు అందుకున్న జోన్ 2 చైర్పర్సన్ ఏవి రామకృష్ణారావు. *(ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)*.....

జై వాసవి... జై జై వాసవి...🙏
తేదీ 30.08.2026, ఆదివారం, నిన్నటి దినం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం జిల్లా,
 వి 201 ఏ , రీజియన్ 2  
 *మనోదర్శిని వాసవి రీజనల్ కాన్ఫరెన్స్(ప్రాంతీయ సమావేశం)* రీజినల్ చైర్ పర్సన్ వాసవియన్ తమ్మన మానస గారి పర్యవేక్షణలో డాబా గార్డెన్స్ లో గల అల్లూరి సీతారామరాజు ఆడిటోరియం 3 వ అంతస్థులో అత్యంత అద్భుతంగా సభ్యులు మరువలేని రీతిలో అంగరంగ వైభవంగా జరిగింది.ముందుగా చెన్నై నుండి విచ్చేసిన ముఖ్యఅతిథి సుజాత రమేష్ బాబు వి సి ఐ వారి పతాకమును ఎగురవేసి,తర్వాత ముఖ్య అతిథి , రీజియన్ చైర్ పర్సన్ తమ్మన మానస, అబ్జర్వర్ గ్రంధి వాసుదేవమూర్తి, జోన్ 2 చైర్ పర్సన్ వెంకట రామకృష్ణారావు లు కపోతములు(పావురములు) ఎగురవేసిన అనంతరం సమావేశ హాల్ నకు ముఖ్యఅతిథి కి సభ్యులు ఘన స్వాగతం పలికినారు. 
 2026 లో జరిగిన మొదటి కాన్ఫరెన్స్ అయినప్పటికీ కనీవినీ ఎరుగని రీతిలో ఈ సమావేశం జరిగిందని చెప్పుకొనుటలో సందేహం లేదు. ఈ సమావేశంలో 300 కు పైగా రీజియన్ లో గల సభ్యులు , వివిధ క్లబ్బుల అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారులు, జిల్లా పదాధికారులు, ఐఇసి ఆఫీసర్లు, వైస్ గవర్నర్లు, పాల్గొన్నారు, గవర్నర్ వంకాయల సాయినిర్మల మరియు రాంగోపాల్ గార్లు స్నేహపూర్వకంగా వచ్చి ఆమెకు ప్రత్యేకమైన అభినందనలు తెలిపినారు. కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు వందల సంఖ్యలో సభ్యులు ఉండడం ఇదే మొదటిసారి. కారణం.... గత నెల రోజులుగా ఆన్ లైన్లో హౌసీలు,ఎన్నో కాంపిటీషన్స్ నిర్వహించగా ఈ దినము కూడా లక్కీ డిప్స్ తో సభ్యులు ఆనంద భరితులైనారు . గెలుపొందిన వారు బహుమతులతో ఆనందించగా మిగతా సభ్యులు కార్యక్రమం జరిగిన తీరును చూసి ఆనందించినారు. ఈ కార్యక్రమానికి గెస్ట్ ఆఫ్ హానర్ గా పద్మజ గారు, అబ్జర్వర్ గా గ్రంధి వాసుదేవ్ మూర్తి హాజరైనారు. ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏవీఎస్ఎన్ గుప్తా గారు అంతర్జాతీయ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వేద మధుసూదన్ గార్లు వచ్చి మానస గారిని అభినందించడం ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ప్రోగ్రాం చైర్ పర్సన్ సుగుణ గారు ,సునీల్ గుప్తా గారు వాళ్ల టీమ్ మెంబర్స్ చక్కటి సమన్వయంతో కార్యక్రమం మొత్తాన్ని విజయవంతం చేయడానికి కారుకులైనారు.ఎం ఓ సి ఐ ఆర్ కే ప్రసాద్ గారు ప్రసంగం (యాంకరింగ్) సభ్యులందరికీ ఆకట్టుకుంది. మైండ్ రీడర్ రవి గారి మైండ్ ప్రదర్శనలు సభ్యులందరికీ ఆశ్చర్య చికితులని చేసినవి. ఇది ఒక ప్రత్యేక ప్రదర్శనగా అందరూ ఆనందించినారు. భోజనానంతరం కూడా సభ్యులతో హాలు కిటకిటలాడింది. సభ్యుల కరతాల ధ్వనుల మరియు డాన్స్ లతో వివిధ క్లబ్బుల యొక్క బ్యానర్ ప్రజెంటేషన్ లు, డాన్స్ లు అదేవిధంగా అవార్డుల , రివార్డుల సందడే సందడి. మానస గారు తన రీజియన్ లో గల క్లబ్బుల పి ఎస్ టి లకు, జడ్సీలకు, ఆర్ఎస్ కు తగిన గుర్తింపు గా అవార్డులు అందించారు.
*జోన్ 2 చైర్ పర్సన్ వెంకట రామకృష్ణారావు గారికి సూపర్ బెస్ట్ జోన్ చైర్ పర్సన్ గా గుర్తించి అవార్డును బహుకరించినారు* మనోదర్శిని రీజినల్ కాన్ఫరెన్స్ ను విజయవంతం చేయడంలో తనదైన పాత్ర పోషించిన పూర్వపు గవర్నర్ తమ్మన అమర్నాథ్ తన సహ ధర్మచారిని కి మరొక మెట్టు ఎక్కించే ప్రయత్న చేసి సఫలీకృతులైనారు. అది విజయవంతం అయింది. ముఖ్యఅతిథి సుజాత రమేష్ బాబు గారు మాట్లాడిన మాటలు తక్కువే అయినప్పటికీ అందరిని ఆకట్టుకున్నాయి.ఈ రీజియన్ కాన్ఫరెన్స్ లో అత్యంత నైపుణ్యం చూపిన అమర్నాథ్ గారికి అభినందన తెలియచేస్తూ ఆయన నైపుణ్యం VCI వారు ముందుగానే గుర్తించి అంతర్జాతీయ వాసవి క్లబ్ నైపుణ్య అభివృద్ధి సంస్థకు చైర్మన్గా నియమించారని ఇందుమూలముగా తెలియజేశారు .అబ్జర్వర్ గా హాజరైన వాసవియన్ వాసుదేవ మూర్తి గారి మాటల్లో ఈ సమావేశం రీజియన్ కాన్ఫరెన్స్ గా లేదని ఒక జిల్లా కాన్ఫరెన్స్ గా ఉన్నదని చెప్పటం ఒక విచిత్రం.
కార్యక్రమం మొత్తం అంబరాన్ని అంటిన సంబరం ల కొనసాగినది.
ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరిపించిన మా రీజియన్ చైర్ పర్సన్ వాసవియన్ తమ్మన మానస గారి కి , అమర్నాథ్ గారికి అదేవిధంగా వారికి అనేక విధములుగా సహాయ సహకారములు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు.