విశాఖ జిల్లా ఎండాడ వైశాకి స్కై పార్క్ ఆధ్వర్యంలో లైన్స్ క్లబ్ నూతన సభ్యుల చేరిక, ముఖ్య అతిథిగా పూర్వపు గవర్నర్ లయన్స్ ప్రొఫెసర్ ఎన్ వి ఎన్ దుర్గాప్రసాదరావు.. నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన దుర్గా ప్రసాద్ రావు. క్లబ్ సభ్యులంతా సేవా భావంతో పనిచేయాలి.. అద్వితీయమైన సేవలు అందిస్తున్న లైన్స్ క్లబ్... ఐక్యమత్యంతో పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి..

విశాఖ సిటీ, ప్రజాబలం ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )

 విశాఖపట్నం జిల్లా,లైన్స్ క్లబ్ ఎండాడ , వైశాకి స్కై పార్క్ ఆధ్వర్యంలో . మంగళవారం. సాయంత్రం .బీచ్ రోడ్ లో గల ఒక హోటల్లో లైన్స్ క్లబ్ నూతన సభ్యులు చేర్చేందుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పూర్వపు గవర్నర్ లయన్ ప్రొఫెసర్ ఎన్ వి ఎన్ దుర్గాప్రసాద రావు నూతన సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైన్స్ క్లబ్ ప్రాముఖ్యత వివరిస్తూ ప్రపంచ స్థాయిలో ఈ క్లబ్బుకు మించిన సంస్థ లేదని సేవా కార్యక్రమంలో చాలా ముందంజలో ఉంటారని తెలియజేసినారు. అధ్యక్ష , కార్యదర్శి ,కోశాధికారులకు కొన్ని సూచనలు సలహాలు తెలియజేస్తూ ,లయన్స్ మెంబర్లలో సేవాభావం అధికంగా ఉంటుందని కొత్తగా జాయిన్ అయిన మెంబర్లు సేవలు ప్రాముఖ్యత తెలుసుకొని సేవాభావంతో సేవల్లో పాల్గొనాలని కోరారు. అధ్యక్షులు శంకర ప్రసాద్ , కార్యదర్శి సీతారామరాజు, కోశాధికారి విశ్వనాథ శాస్త్రిలు ఫిబ్రవరి నెలలో స్కై పార్క్ లో లైన్స్ క్లబ్ ప్రారంభించిన నాటి నుండి ఇప్పటివరకు చేసిన సేవా కార్యక్రమాల గురించి వివరించినారు. సభ్యుల సహకారంతో రానున్న కాలంలో ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి మా వంతుగా కృషి చేస్తామని అధ్యక్షులు తెలిపినారు. అధ్యక్షులు , కార్యదర్శి, కోశాధికారి లకు మెడల్స్ ను ముఖ్య అతిథి చేతులతో మెడలో వేసినారు మరియు నూతన సభ్యులకు లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుండి వచ్చిన కిట్లను సభ్యుల చే అందజేసినారు. తదనంతరం ముఖ్య అతిథి దుర్గాప్రసాద్ రావు కి అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి లు శాలువ తో సత్కరించినారు.ఈ కార్యక్రమానికి పూర్వపు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర రావు, లైన్స్ క్లబ్ సభ్యులు అందరూ కుటుంబ సమేతంగా హాజరైనారు. క్లబ్ సభ్యులందరికీ విందు ఏర్పాటు చేశారు..