పూర్ణ మార్కెట్ జీవీఎంసీ ప్రైమరీ స్కూల్లో సరస్వతి దేవి విగ్రహాన్ని ఆవిష్కరించిన వాసవి క్లబ్ విశాఖ జిల్లా గవర్నర్ వంకాయల సాయినిర్మల.

జై వాసవి 🙏జై జై వాసవి.
 విశాఖ సిటీ, (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
వాసవి క్లబ్ చే సరస్వతి దేవి విగ్రహ ఆవిష్కరణ
-------------------

శుక్రవారం, 4వ సెప్టెంబర్ 2026 న జీవీఎంసీ ప్రైమరీ స్కూల్ లో ,, (పూర్ణా మార్కెట్‌ దగ్గిర) వాసవి క్లబ్ మహా విశాఖ ఆధ్వర్యంలో సరస్వతి దేవి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని జిల్లా గవర్నర్ శ్రీమతి వంకాయల సాయినిర్మలా గారు ఉదయం 10:35 గంటలకు తమ చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా
రీజన్ చైర్‌పర్సన్ శ్రీ కంకటాల సతీష్ గారు, రీజనల్ సెక్రటరీ శ్రీమతి శ్రీలక్ష్మి గారు, జోన్ చైర్‌పర్సన్ సాధనా గారు, అలాగే మా క్లబ్ ప్రెసిడెంట్ కర్నాటి హర్షిత, సెక్రటరీ, ట్రెజరర్, కో-చైర్‌పర్సన్ శ్రీ సురేంద్ర గారు మరియు మహావిశాఖ క్లబ్ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అదే రోజు వాసవి వారోత్సవాలలో భాగంగా క్లబ్ సభ్యులందరితో విలేజ్ గేమ్స్ నిర్వహించడం జరిగింది. ఉత్సాహంగా పాల్గొన్న సభ్యులకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్‌తో పాటు సర్టిఫికేట్స్ కూడా అందజేయడం జరిగింది.

 క్లబ్ సభ్యులందరి సహకారం, మరియు సమిష్టి కృషితో ఈ రెండు కార్యక్రమాలు ఎంతో విజయవంతంగా పూర్తయ్యాయి.

ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు.